నేను : నా డిగ్రీ కాలేజీ
ఇంటర్మీడియట్ అవ్వగానే ఎంసెట్ ఫీవర్ స్టార్ట్ , అస్సలు టైం సరిపోయేది కాదు. ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే ఇక లైఫ్ వేస్ట్ అన్నంతగా ప్రెషర్ ఉండేది. షార్ట్ టర్మ్ లో అరవై వేలు ర్యాంక్ వచ్చింది. సీట్ కచితంగా రాదు.
అప్పటికి నా దగ్గర NCC A సర్టిఫికేట్ మాత్రమే ఉంది. NCC కోటాలో ట్రై చేసాం కానీ సీట్ రాలేదు.
2001 వ సంవత్సరం , అపట్లో ఇంజనీరింగ్ సీట్స్ చాలా కష్టం. ఏం చేయాలో తెలియని అయోమయం.
డిగ్రీ జాయిన్ అవ్వడమంటే అపటికే అదొక ఫెయిల్యూర్ స్టొరీ. డొనేషన్ కట్టే పోసిషన్ లేదు ఇంట్లో.ఎలాగో అల ఇంటర్మీడియట్ ఆదిత్య సర్ పుణ్యమాని పూర్తయింది.ఎవరో చెబితే ఎయిర్ ఫోర్సు కి అప్లై చేశాను.ఇంటర్వ్యూ కి పిలిచారు. అదే మొదటిసారి చెన్నై వెళ్ళడం.తాంబరం ఎయిర్ ఫోర్సు స్టేషన్ లో ఇంటర్వ్యూ. నాన్న నేను వెళ్ళాం. ఇంటర్వ్యూ లో మొదటి నాలుగు రౌండ్లు పాస్ అయ్యాను. ఈ ఇంటర్వ్యూ కి నా స్కూల్ ఫ్రెండ్ చక్రి కూడా వచ్చాడు.ఇక లాస్ట్ రౌండ్ కంటి పరీక్ష.అక్కడ నాకు సైట్ ఉండడం వాళ్ళ సెలెక్ట్ అవ్వలేదు.చాలా బాదేసింది.ఇక ఏమి చేసేది లేక మళ్లీ ఎంసెట్ మీదే పడ్డాను. ఒక సంవత్సరం దాని మీదే టైం పెట్టి చదివినా మళ్లీ ర్యాంక్ నేలబై వేలల్లో వచ్చింది.ఈ సారి కూడా సీట్ రాలేదు.డిగ్రీ జాయిన్ అవ్వడం తప్పలేదు.అలా ఇంజనీరింగ్ చేయలేదనే అసంతృప్తి అలా మిగిలిపోఇంది.
అప్పటికే టైం అయిపోవడం తో ఎక్కడ డిగ్రీ కాలేజీ లో సీట్స్ లేవు.ప్రైవేటు కాలేజీ లో చేరే స్తోమత లేకపోవడం తో మళ్లీ సావర్కర్ సర్ సహాయంతో సీట్ సంపాదించాను.అక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం తో తెలుగు మీడియం లోనే చేరాల్సి వచ్చింది.తెలుగు లో సబ్జక్ట్స్ వినడమంటే చాలా కష్టం గా ఉండేది.
మళ్ళి నా లైఫ్ లోకి NCC ఇక్కడే నేను B , C సర్టిఫికెట్స్ పూర్తిచేసాను.ఐదు క్యాంపులకు వెళ్ళాను.
ఇక్కడ చదువుతున్నపుడు మా వి అర్ హై స్కూల్ గుర్తువచ్చేది.డిగ్రీ మూడు సంవత్సరాలు బయట లైఫ్ ఎక్కువగా తెలిసింది.సంపాదనలో పడ్డాను.నా ఖర్చులు నేనే చుసుకునేవాడిని.అలా డిగ్రీ పూర్తైంది.
డిగ్రీ మొత్తం మీద నాకు ఎప్పుడూ గుర్తు ఉండే ఒక సంగటన, నాకు మా ఫిజిక్స్ లెక్చరర్ కి మధ్య జరిగింది. ఒక రోజు అయన మా క్లాసు అందరితో ఏదో సందర్భం లో ఫిజిక్స్ లో కూడా మీరు తొంబై శాతం తెచుకోవోచ్చు, లాస్ట్ ఇయర్ కూడా ఎవరికో ఫిజిక్స్ లో తొంబై ఐదు మార్కులు వచ్చాయ్ అని నాతోనే అనడంతో మా స్నేహితుడు ఒకడు అది వీడికే సర్ అనడంతో అయన కంగుతిన్నాడు.కారణం ఆ ఇయర్ నాకు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయ్. మొదటి సంవత్సరం తొంబై ఐదు వచ్చిన వాడికి రెండవ సంవత్సరం ముప్పై ఐదు మార్కులు వస్తాయ్ అనే అయన అనుకోలేదు. ఇది తలచుకున్నపుడల్లా నవ్వొస్తుంది.
ఇంతకీ మా కాలేజీ పేరు చెప్పలేదు కదా : సర్వోదయ ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కాలేజీ , నెల్లూరు.
No comments:
Post a Comment