Wednesday, May 8, 2013

నేను (NENU) Chapter 2 : నా జూనియర్ కాలేజీ


నేను : నా జూనియర్ కాలేజీ

టెన్త్ అవ్వగానే APRJC కోచింగ్ కోసం మా కాలేజీ వాళ్ళు మా స్కూల్ లో మంచి మార్కులు వచ్చిన మొదటి పదేమందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలో నేను ఒకడిని. అదే మొదటే సరే మా కాలేజీ చూడడం , అంటే ఇంటర్మీడియట్ చేరకముందే నేను మా కాలేజీ లో చదువుకున్నాను.

రేకులు వేసి ఉన్న క్లాస్రూమ్ లు వాటి పై నిండా అల్లుకున్న చెట్టు కొమ్మలు , చూడడానికి చాల ప్రశాంతంగా ఉండేది. మా కాలేజీ అప్పట్లో  APRJC కోచింగ్ కి బాగా ఫేమస్. అక్కడ కోచింగ్ కోసం రాయలసీమ ప్రాంతం నుండే చాల మంది వచేవాళ్ళు. అలా నాకు చాలామంది రాయలసీమ ఫ్రెండ్స్ దొరికారు. నాకు  APRJC లో మంచి స్కోర్ రాలేదు. ఇంటర్మీడియట్ చేరడానికి గవర్నమెంట్ కాలేజీ అన్నింట్లో అప్లై చేశాను.అనుకోకుండా మా కాలేజీ లోనే సీట్ ఇచ్చారు. ఇక్కడ సావర్కర్ సర్ గురించి చెప్పుకోవాలి , అయన నన్ను మా కాలేజీ కరెస్పాండంట్ ఆదిత్య గారితో మాట్లాడి మొత్తం రెండు సంవత్సరాలు నన్ను బాగా చూసుకున్నారు. దానికి నేను మా కాలేజీ కి ఋణం పడిఉన్నాను .ఆదిత్య సర్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా ఇంటర్మీడియట్ కు సహాయపడ్డారు.నాకు ఇంటర్మీడియట్ లో తొంబై శాతం మార్కులు రావడంతో మా ఆదిత్య సర్ పేపర్ లో వేయించారు. ఇప్పటికీ మా కాలేజీ కి వెళ్తే మా ఫొటోస్ , మా మార్కులు అయన టేబుల్ మీద చోడొచ్చు.అయన మాకు అంత ప్రాముక్యత ఇచ్చేవారు.

మా కాలేజీ అంటే నాకు మాథ్స్, ఫిజిక్స్ సబ్జక్ట్స్ గుర్తోస్తాయ్, ఎందుకంటే అవంటే నాకు చాల ఇష్టం. మొత్తం రెండు సంవత్సరాలు ఎలా జరిగిపోయాయో కూడా తెలీదు. మా కాలేజీ దగ్గర వినాయకుడి గుడి ఉండేది , రోజు ఉదయం గుడి కి వెళ్ళేవాడిని మా ఇంట్లో ఇచ్చిన పూలు వినాయకుడికి ఇచ్చేవాడిని, అలా ఆ గుడి పూజారి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ప్రతి పరీక్ష ముందు ఆ గుడి కి వెళ్ళడం సెంటిమెంట్ గా మారిపోఇంది.ఇప్పటికి అలా వెళ్తే ఆ రోజులు గుర్తొస్తుంటాయి , ఇప్పుడు ఆ ప్రాంతం బాగా మారిపోఇంది.

నేను మా కాలేజీ కి నా హీరో సైకిల్ మీదే వెళ్ళేవాడిని , ఒకరోజు నేను కాలేజీ నుండి వస్తుంటే ఒకడు బాగా తాగి రిక్షాలో కుర్చుని వస్తున్నాడు , వాడు ఆ రిక్షావాడి తో గొడవపడుతూ నన్ను ఆపాడు, ఆ రోజు చాలా బయమేసింది , సైకిల్ పట్టుకుని చాలా ఇబ్బందిపెట్టాడు. ఆ తర్వాత అతను ఇప్పటికి నాకు నెల్లూరు లో కనిపిస్తూనే ఉంటాడు ఇద్దరం నవ్వుకుంటాం. ఇంటర్మీడియట్ చెదివే రోజుల్లో మేము ఒక గ్రూప్ ఉండేవాళ్ళం అంతా నాగార్జున ఫాన్స్ , నాగార్జున మూవీ రిలీజ్ అవ్తుందంటే ఇక కాలేజీ అంతా ఆ థియేటర్ లోనే , కట్ అవుట్, బ్యానర్ , పేపర్స్ , పూలు అబ్బో ఎంత హంగామా చేసేవాళ్ళమో. నాగార్జున అంటే అంత ఇష్టం ఆ రోజుల్లో. ఇంటి నిండా నాగ్ ఫొటోలే.

అప్పుడే ఆజాద్ రిలీజ్ ఐయింది. డైరెక్టర్ తిరుపతిస్వామి నెల్లూరు వచ్చారు చెన్నై నుండి.అయన మాతోపాటే మార్నింగ్ షో చూడడం , మాతో మాట్లాడడం నేను ఎప్పటికి మర్చిపోలేను. తర్వాత అయన ఒక రోడ్ ప్రమాదంలో చనిపోయారని తెలిసింది.


ఆర్కుట్ లో మా కాలేజీ గ్రూప్ ద్వారా అందరం టచ్ లో ఉన్నాం. కొందరు ఫోన్ లో కూడా టచ్ లో ఉన్నారు.

ఇంతకీ మా కాలేజీ పేరు చెప్పనే లేదు కదూ.. ఆదిత్య జూనియర్ కాలేజీ , నెల్లూరు.

No comments:

Post a Comment