Monday, May 6, 2013

నేను (NENU) Chapter 1: నా స్కూల్


స్కూల్ కి టైం అవ్తుందని త్వరగా నా హీరో సైకిల్ తీసాను , అప్రయత్నం గా ఎప్పుడు నా చేతులు నా సైకిల్ టైర్స్ లో గాలి ఉందో లేదో అనీ చూస్తాయ్. స్కూల్ బాగ్ వెనక కారియర్ కీ పెట్టి , ఆ బాగ్ పడిపోకుండా దానికీ కారియర్ స్టాండ్ వేసి చెక్ చేశాను .నేను స్కూల్ కి వెళ్ళే దారి నాకు చాలా ఇష్టం , ఆ దారిలో నేను సినిమా వాల్ పోస్టర్ అన్ని చూస్తూ ఆ సినిమా కథను అంచనా వేస్తూ చక్రి ఇంటికీ వెళ్లి వాడినీ నా సైకిల్ మీద ఎక్కించుకుని వాడితో ఆ వాల్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటూ స్కూల్ కి చేరేవాడిని .



మా స్కూల్ అంటే మాకు మా ప్లేగ్రౌండ్ గుర్తొస్తుంది ..అక్కడ మాకు క్రికెట్ త్రో మ్యాచ్ బాగా ఫేమస్.
ఉదయం స్కూల్ కీ చేరినప్పటి నుండే సాయంత్రం ఆడే మ్యాచ్ కోసం గుసగుసలు స్టార్ట్ అవుతాయ్ .
క్లాసు లో ఎం చెప్తున్న మేము మాత్రం ఆ మ్యాచ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళం.సాయంత్రం అవ్వగానే
మా స్కూల్ లో ఉన్న ఏ సెక్షన్ , బి సెక్షన్ మధ్య మ్యాచ్ ఇప్పటికీ అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను ఓపెనింగ్ దించేవారు , నేను అస్సలు ఆడే వాడినీ కాదు .కాని మా కెప్టెన్ కళ్యాణ్ మాత్రం నన్ను ఓపెనింగ్ లోనే ఆడించేవాడు. నాకు బాగా గుర్తు ఒక రోజు నేను సిక్స్ కొట్టాను అదే పక్కన ఉన్న టౌన్ హాళ్ళో పడింది .
మా స్కూల్ లో బెంచులు సిమెంట్ తో చేసుంటారు దానికీ ఒక ర్యాక్ కూడా ఉంటుంది , అ ర్యాక్ లో మేము ఉసిరికాయలు, మామిడికాయలు ఉప్పు కారం తో పెట్టుకుని క్లాసు జరుగుతుంటే తినేవాళ్ళం . పాకెట్ మనీ పది రూపాయలు ఉంటె ఒక రోజంతా ఫుల్ హ్యాపీ .

మా స్కూల్ లో నన్ను ఆకట్టుకున్న మరో విషయం N C C . నేను N C C  లో చేరడానికి ముక్యమైన కారణం మా చక్రి అయితే మరొక కారణం టిఫిన్ టోకెన్ . N C C అటెండ్ అయితే మాకు  టిఫిన్ టోకెన్ ఇచ్చేవాళ్ళు అది వెంకటరమణ హోటల్ , అక్కడ దోస బలే ఉండేది .  N C C  లో ఆర్మీ డ్రెస్ వేసుకుని పెరేడ్ చేస్తుంటే బలే ఉండేది . నన్ను N C C లో కాకుటూరు కి క్యాంపు కి పంపించారు. అప్పుడు రోజు సాయంత్రం ఇంట్లో వాళ్ళు గుర్తు వచేవాళ్ళు . ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది ఎందుకంటే కాకుటూరు నెల్లూరు కీ కేవలం 20 KM ల దూరం మాత్రమే.అలా N C C లో A సర్టిఫికేట్ సంపాదించాను.

ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదా ?  వి ఆర్ హై స్కూల్ .
నాకు గుర్తు ఉన్న నా స్నేహితుల పేర్లు చక్రి,కళ్యాణ్,సుబ్బు,అభిరాం,సందీప్,కిరణ్..

ఈ మధ్య మా స్కూల్ కి వెళ్ళాలని అనిపించి వెళ్లి మా క్లాసు లో కూర్చున్నాను, ప్లే గ్రౌండ్ అంత తిరిగాను అక్కడ ఆడుతున్న వాళ్ళను చూసి నన్ను నేను చూసుకున్నాను. ఇప్పుడు నా వయసు ఇరవై తొమ్మిది , అంటే నా స్కూల్ విడిచి పెట్టి పదమూడు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూనే ఉంటాయి. నా మీద  వి ఆర్ హై స్కూల్ ప్రభావం చాలా ఉంది ..




No comments:

Post a Comment