Wednesday, May 15, 2013

NENU Chapters ..Coming soon :)


Chapter 1:   Nenu ..Naa school.                 
Chapter 2:   Nenu.. Naa junior college     
Chapter 3:   Nenu..Naa Degree college.
Chapter 4:   Nenu..Naa PG College.
Chapter 5:   Nenu..Maa Krishna sir, 
Chapter 6:   Nenu..Maa Savarkar sir,
Chapter 7:   Nenu.Naa Modati Udyogam.
Chapter 8:   Nenu..Naa IBM
Chapter 9:   Nenu..Naa balyam.
Chapter 10: Nenu..Naa Yavvanam.
Chapter 11: Nenu..Naa NCC
Chapter 12: Nenu..Naa snehitulu.
Chapter 13: Nenu- Naa kutumbham
Chapter 14: Nenu-Naa Cinemalu
Chapter 15: Nenu-Naa Diareelu.
Chapter 16: Nenu- Naa Pusthakalu.
Chapter 17: Nenu- Naa Pradesalu.

Tuesday, May 14, 2013

ATTITUDE....by suman narla


Some people say we have bad attitude, some one say we have a good one and we should keep it up....


So, it varies from person to person and even they don't know what is good attitude and bad one is..

We should not judge our self or some body based on the situations but yes based on attitude. How they/we see the situations, react in the situations, feel the situations will matters...


Labeling a person was very easy ...but judging him was very difficult because his attitude is good for some people and bad for other people .


 

Sunday, May 12, 2013

నేను (NENU) Chapter 4 : నా పీజీ కాలేజీ


నేను : నా పీజీ కాలేజీ

డిగ్రీ కాగానే మళ్లీ అయోమయం. తర్వాత ఎం చేయాలి అని, డిగ్రీ కి ఉద్యోగాలు తక్కువ. M Sc  చేద్దామని డిసైడ్ అయ్యి ఎంట్రన్స్ రాశాను. అలాగే MCA కోసం కూడా I Cet రాశాను.కాని MCA చెయ్యాలని లేదు. ఫిజిక్స్ లో  M Sc కోసం బాగా ట్రై చేశాను,అనుకోకుండా I Cet లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పటికే NCC ఉండడంవల్ల సీట్ వచ్చింది. ఎస్ వి యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీ లో అడ్మిషన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను మొత్తం నా చదువు 75 % వరకు గవర్నమెంట్ స్కూల్స్ , కాలేజీ లోనే చదవడం నా అదృష్టమనే అనుకుంటాను.

PG సెంటర్ లో చేరడం, MCA చదవడం నా లైఫ్ లో ఇంజనీరింగ్ చేయలేదనే బాధను చాలా వరకు తగ్గించింది.kavali లో మా కాలేజీ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉండేది.మంచి స్నేహితులని ఇచ్చింది.
మదుర జ్ఞాపకాలు ఎందుకంటే PG చేస్తున్నాం అంటేనే పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అన్ని విషయాలు తెలుసి ఉంటుంది.

మీ కోసం కొన్ని ఫోటోలు.  































Wednesday, May 8, 2013

నేను (NENU) Chapter 3: నా డిగ్రీ కాలేజీ

నేను : నా డిగ్రీ కాలేజీ

ఇంటర్మీడియట్ అవ్వగానే ఎంసెట్ ఫీవర్ స్టార్ట్ , అస్సలు టైం సరిపోయేది కాదు. ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే ఇక లైఫ్ వేస్ట్ అన్నంతగా ప్రెషర్ ఉండేది. షార్ట్ టర్మ్ లో అరవై వేలు ర్యాంక్ వచ్చింది. సీట్ కచితంగా రాదు.
అప్పటికి నా దగ్గర NCC A సర్టిఫికేట్ మాత్రమే ఉంది. NCC కోటాలో ట్రై చేసాం కానీ సీట్ రాలేదు.
2001 వ సంవత్సరం , అపట్లో ఇంజనీరింగ్ సీట్స్ చాలా కష్టం. ఏం చేయాలో తెలియని అయోమయం.

డిగ్రీ జాయిన్ అవ్వడమంటే అపటికే అదొక ఫెయిల్యూర్ స్టొరీ. డొనేషన్ కట్టే పోసిషన్ లేదు ఇంట్లో.ఎలాగో అల ఇంటర్మీడియట్ ఆదిత్య సర్ పుణ్యమాని పూర్తయింది.ఎవరో చెబితే ఎయిర్ ఫోర్సు కి అప్లై చేశాను.ఇంటర్వ్యూ కి పిలిచారు. అదే మొదటిసారి చెన్నై వెళ్ళడం.తాంబరం ఎయిర్ ఫోర్సు స్టేషన్ లో ఇంటర్వ్యూ. నాన్న నేను వెళ్ళాం. ఇంటర్వ్యూ లో మొదటి నాలుగు రౌండ్లు పాస్ అయ్యాను. ఈ ఇంటర్వ్యూ కి నా స్కూల్ ఫ్రెండ్ చక్రి కూడా వచ్చాడు.ఇక లాస్ట్ రౌండ్ కంటి పరీక్ష.అక్కడ నాకు సైట్ ఉండడం వాళ్ళ సెలెక్ట్ అవ్వలేదు.చాలా బాదేసింది.ఇక ఏమి చేసేది లేక మళ్లీ ఎంసెట్ మీదే పడ్డాను. ఒక సంవత్సరం దాని మీదే టైం పెట్టి చదివినా మళ్లీ ర్యాంక్ నేలబై వేలల్లో వచ్చింది.ఈ సారి కూడా సీట్ రాలేదు.డిగ్రీ జాయిన్ అవ్వడం తప్పలేదు.అలా ఇంజనీరింగ్ చేయలేదనే అసంతృప్తి అలా మిగిలిపోఇంది.

అప్పటికే టైం అయిపోవడం తో ఎక్కడ డిగ్రీ కాలేజీ లో సీట్స్ లేవు.ప్రైవేటు కాలేజీ లో చేరే స్తోమత లేకపోవడం తో మళ్లీ సావర్కర్ సర్ సహాయంతో సీట్ సంపాదించాను.అక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం తో తెలుగు మీడియం లోనే చేరాల్సి వచ్చింది.తెలుగు లో సబ్జక్ట్స్ వినడమంటే చాలా కష్టం గా ఉండేది.
మళ్ళి నా లైఫ్ లోకి NCC ఇక్కడే నేను B , C  సర్టిఫికెట్స్ పూర్తిచేసాను.ఐదు క్యాంపులకు వెళ్ళాను.
ఇక్కడ చదువుతున్నపుడు మా వి అర్ హై స్కూల్ గుర్తువచ్చేది.డిగ్రీ మూడు సంవత్సరాలు బయట లైఫ్ ఎక్కువగా తెలిసింది.సంపాదనలో పడ్డాను.నా ఖర్చులు నేనే చుసుకునేవాడిని.అలా డిగ్రీ పూర్తైంది.



డిగ్రీ మొత్తం మీద నాకు ఎప్పుడూ గుర్తు ఉండే ఒక సంగటన, నాకు మా ఫిజిక్స్  లెక్చరర్ కి మధ్య జరిగింది. ఒక రోజు అయన మా క్లాసు అందరితో ఏదో సందర్భం లో ఫిజిక్స్ లో కూడా మీరు తొంబై శాతం తెచుకోవోచ్చు, లాస్ట్ ఇయర్ కూడా ఎవరికో ఫిజిక్స్ లో తొంబై ఐదు మార్కులు వచ్చాయ్ అని నాతోనే అనడంతో మా స్నేహితుడు ఒకడు అది వీడికే సర్ అనడంతో అయన కంగుతిన్నాడు.కారణం ఆ ఇయర్ నాకు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయ్. మొదటి సంవత్సరం తొంబై ఐదు వచ్చిన వాడికి రెండవ సంవత్సరం ముప్పై ఐదు మార్కులు వస్తాయ్ అనే అయన అనుకోలేదు. ఇది తలచుకున్నపుడల్లా నవ్వొస్తుంది.

ఇంతకీ మా కాలేజీ పేరు చెప్పలేదు కదా : సర్వోదయ ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కాలేజీ , నెల్లూరు.



నేను (NENU) Chapter 2 : నా జూనియర్ కాలేజీ


నేను : నా జూనియర్ కాలేజీ

టెన్త్ అవ్వగానే APRJC కోచింగ్ కోసం మా కాలేజీ వాళ్ళు మా స్కూల్ లో మంచి మార్కులు వచ్చిన మొదటి పదేమందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలో నేను ఒకడిని. అదే మొదటే సరే మా కాలేజీ చూడడం , అంటే ఇంటర్మీడియట్ చేరకముందే నేను మా కాలేజీ లో చదువుకున్నాను.

రేకులు వేసి ఉన్న క్లాస్రూమ్ లు వాటి పై నిండా అల్లుకున్న చెట్టు కొమ్మలు , చూడడానికి చాల ప్రశాంతంగా ఉండేది. మా కాలేజీ అప్పట్లో  APRJC కోచింగ్ కి బాగా ఫేమస్. అక్కడ కోచింగ్ కోసం రాయలసీమ ప్రాంతం నుండే చాల మంది వచేవాళ్ళు. అలా నాకు చాలామంది రాయలసీమ ఫ్రెండ్స్ దొరికారు. నాకు  APRJC లో మంచి స్కోర్ రాలేదు. ఇంటర్మీడియట్ చేరడానికి గవర్నమెంట్ కాలేజీ అన్నింట్లో అప్లై చేశాను.అనుకోకుండా మా కాలేజీ లోనే సీట్ ఇచ్చారు. ఇక్కడ సావర్కర్ సర్ గురించి చెప్పుకోవాలి , అయన నన్ను మా కాలేజీ కరెస్పాండంట్ ఆదిత్య గారితో మాట్లాడి మొత్తం రెండు సంవత్సరాలు నన్ను బాగా చూసుకున్నారు. దానికి నేను మా కాలేజీ కి ఋణం పడిఉన్నాను .ఆదిత్య సర్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా ఇంటర్మీడియట్ కు సహాయపడ్డారు.నాకు ఇంటర్మీడియట్ లో తొంబై శాతం మార్కులు రావడంతో మా ఆదిత్య సర్ పేపర్ లో వేయించారు. ఇప్పటికీ మా కాలేజీ కి వెళ్తే మా ఫొటోస్ , మా మార్కులు అయన టేబుల్ మీద చోడొచ్చు.అయన మాకు అంత ప్రాముక్యత ఇచ్చేవారు.

మా కాలేజీ అంటే నాకు మాథ్స్, ఫిజిక్స్ సబ్జక్ట్స్ గుర్తోస్తాయ్, ఎందుకంటే అవంటే నాకు చాల ఇష్టం. మొత్తం రెండు సంవత్సరాలు ఎలా జరిగిపోయాయో కూడా తెలీదు. మా కాలేజీ దగ్గర వినాయకుడి గుడి ఉండేది , రోజు ఉదయం గుడి కి వెళ్ళేవాడిని మా ఇంట్లో ఇచ్చిన పూలు వినాయకుడికి ఇచ్చేవాడిని, అలా ఆ గుడి పూజారి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ప్రతి పరీక్ష ముందు ఆ గుడి కి వెళ్ళడం సెంటిమెంట్ గా మారిపోఇంది.ఇప్పటికి అలా వెళ్తే ఆ రోజులు గుర్తొస్తుంటాయి , ఇప్పుడు ఆ ప్రాంతం బాగా మారిపోఇంది.

నేను మా కాలేజీ కి నా హీరో సైకిల్ మీదే వెళ్ళేవాడిని , ఒకరోజు నేను కాలేజీ నుండి వస్తుంటే ఒకడు బాగా తాగి రిక్షాలో కుర్చుని వస్తున్నాడు , వాడు ఆ రిక్షావాడి తో గొడవపడుతూ నన్ను ఆపాడు, ఆ రోజు చాలా బయమేసింది , సైకిల్ పట్టుకుని చాలా ఇబ్బందిపెట్టాడు. ఆ తర్వాత అతను ఇప్పటికి నాకు నెల్లూరు లో కనిపిస్తూనే ఉంటాడు ఇద్దరం నవ్వుకుంటాం. ఇంటర్మీడియట్ చెదివే రోజుల్లో మేము ఒక గ్రూప్ ఉండేవాళ్ళం అంతా నాగార్జున ఫాన్స్ , నాగార్జున మూవీ రిలీజ్ అవ్తుందంటే ఇక కాలేజీ అంతా ఆ థియేటర్ లోనే , కట్ అవుట్, బ్యానర్ , పేపర్స్ , పూలు అబ్బో ఎంత హంగామా చేసేవాళ్ళమో. నాగార్జున అంటే అంత ఇష్టం ఆ రోజుల్లో. ఇంటి నిండా నాగ్ ఫొటోలే.

అప్పుడే ఆజాద్ రిలీజ్ ఐయింది. డైరెక్టర్ తిరుపతిస్వామి నెల్లూరు వచ్చారు చెన్నై నుండి.అయన మాతోపాటే మార్నింగ్ షో చూడడం , మాతో మాట్లాడడం నేను ఎప్పటికి మర్చిపోలేను. తర్వాత అయన ఒక రోడ్ ప్రమాదంలో చనిపోయారని తెలిసింది.


ఆర్కుట్ లో మా కాలేజీ గ్రూప్ ద్వారా అందరం టచ్ లో ఉన్నాం. కొందరు ఫోన్ లో కూడా టచ్ లో ఉన్నారు.

ఇంతకీ మా కాలేజీ పేరు చెప్పనే లేదు కదూ.. ఆదిత్య జూనియర్ కాలేజీ , నెల్లూరు.

Monday, May 6, 2013

నేను (NENU) Chapter 1: నా స్కూల్


స్కూల్ కి టైం అవ్తుందని త్వరగా నా హీరో సైకిల్ తీసాను , అప్రయత్నం గా ఎప్పుడు నా చేతులు నా సైకిల్ టైర్స్ లో గాలి ఉందో లేదో అనీ చూస్తాయ్. స్కూల్ బాగ్ వెనక కారియర్ కీ పెట్టి , ఆ బాగ్ పడిపోకుండా దానికీ కారియర్ స్టాండ్ వేసి చెక్ చేశాను .నేను స్కూల్ కి వెళ్ళే దారి నాకు చాలా ఇష్టం , ఆ దారిలో నేను సినిమా వాల్ పోస్టర్ అన్ని చూస్తూ ఆ సినిమా కథను అంచనా వేస్తూ చక్రి ఇంటికీ వెళ్లి వాడినీ నా సైకిల్ మీద ఎక్కించుకుని వాడితో ఆ వాల్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటూ స్కూల్ కి చేరేవాడిని .



మా స్కూల్ అంటే మాకు మా ప్లేగ్రౌండ్ గుర్తొస్తుంది ..అక్కడ మాకు క్రికెట్ త్రో మ్యాచ్ బాగా ఫేమస్.
ఉదయం స్కూల్ కీ చేరినప్పటి నుండే సాయంత్రం ఆడే మ్యాచ్ కోసం గుసగుసలు స్టార్ట్ అవుతాయ్ .
క్లాసు లో ఎం చెప్తున్న మేము మాత్రం ఆ మ్యాచ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళం.సాయంత్రం అవ్వగానే
మా స్కూల్ లో ఉన్న ఏ సెక్షన్ , బి సెక్షన్ మధ్య మ్యాచ్ ఇప్పటికీ అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను ఓపెనింగ్ దించేవారు , నేను అస్సలు ఆడే వాడినీ కాదు .కాని మా కెప్టెన్ కళ్యాణ్ మాత్రం నన్ను ఓపెనింగ్ లోనే ఆడించేవాడు. నాకు బాగా గుర్తు ఒక రోజు నేను సిక్స్ కొట్టాను అదే పక్కన ఉన్న టౌన్ హాళ్ళో పడింది .
మా స్కూల్ లో బెంచులు సిమెంట్ తో చేసుంటారు దానికీ ఒక ర్యాక్ కూడా ఉంటుంది , అ ర్యాక్ లో మేము ఉసిరికాయలు, మామిడికాయలు ఉప్పు కారం తో పెట్టుకుని క్లాసు జరుగుతుంటే తినేవాళ్ళం . పాకెట్ మనీ పది రూపాయలు ఉంటె ఒక రోజంతా ఫుల్ హ్యాపీ .

మా స్కూల్ లో నన్ను ఆకట్టుకున్న మరో విషయం N C C . నేను N C C  లో చేరడానికి ముక్యమైన కారణం మా చక్రి అయితే మరొక కారణం టిఫిన్ టోకెన్ . N C C అటెండ్ అయితే మాకు  టిఫిన్ టోకెన్ ఇచ్చేవాళ్ళు అది వెంకటరమణ హోటల్ , అక్కడ దోస బలే ఉండేది .  N C C  లో ఆర్మీ డ్రెస్ వేసుకుని పెరేడ్ చేస్తుంటే బలే ఉండేది . నన్ను N C C లో కాకుటూరు కి క్యాంపు కి పంపించారు. అప్పుడు రోజు సాయంత్రం ఇంట్లో వాళ్ళు గుర్తు వచేవాళ్ళు . ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది ఎందుకంటే కాకుటూరు నెల్లూరు కీ కేవలం 20 KM ల దూరం మాత్రమే.అలా N C C లో A సర్టిఫికేట్ సంపాదించాను.

ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదా ?  వి ఆర్ హై స్కూల్ .
నాకు గుర్తు ఉన్న నా స్నేహితుల పేర్లు చక్రి,కళ్యాణ్,సుబ్బు,అభిరాం,సందీప్,కిరణ్..

ఈ మధ్య మా స్కూల్ కి వెళ్ళాలని అనిపించి వెళ్లి మా క్లాసు లో కూర్చున్నాను, ప్లే గ్రౌండ్ అంత తిరిగాను అక్కడ ఆడుతున్న వాళ్ళను చూసి నన్ను నేను చూసుకున్నాను. ఇప్పుడు నా వయసు ఇరవై తొమ్మిది , అంటే నా స్కూల్ విడిచి పెట్టి పదమూడు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూనే ఉంటాయి. నా మీద  వి ఆర్ హై స్కూల్ ప్రభావం చాలా ఉంది ..




నేను

నేను 

నేను నేనుగా  నీకు నా నిన్నను నేడుగా చేసే చెప్తున్నవిషయం "  నేను "

నేను ని నేను రాస్తున్నప్పుడు నాకు నీ ఆలోచనలే అక్షరాలుగా మారాయి .

ఈ నేను నీకే అంకితం ..