అక్షరాలకు ఆలోచనలు తోడయితే అది కవిత్వం
రాతిరికి జాబిలి తోడయితే అది వెన్నెల
నిదురకు ఊహలు తోడయితే అది స్వప్నం
స్నేహానికి మనిషి తోడయితే అది నువ్వు
-----------------------------------------------------------------------
నేను చెప్పేదీ ఎవరన్న వింటారు ....కాని నేను చెప్పంది వినేవాడివి,
నేను చేసేది ఎవరన్న చూస్తారు ....కాని నేను చెయ్యబోతున్నది చూసేవాడివి,
నేను నా కలలు చెప్తుంటే అందరు వినేవారు ....కాని నేను ఆ కలలను ఎలా నిజంచేస్తాననీ అడిగేవాడివి,
నేను నాతో రమ్మంటే ముందో వెనకో వస్తామనేవారు ...కాని నువ్వు నాతో కలిసి వస్తాననేవాడివి,
నేను నా సుఖాలని అందరితో పంచుకుంటుంటే ...నువ్వు నా బాధలను అడిగి తెలుసుకునేవాడివి,
నేను నా సమయాన్ని ఇంత ఆనందంగా గడిపే క్షణాలు నీ దూరంతో తగ్గిస్తున్నా... నీ జీవితం లో ఒక మెట్టు
ఎక్కుతున్నావనే సంతోషం తో
------------------------------
మా మనస్సు అనే ఇంటి లో , కాలం అనే గది లో , జ్ఞాపకాలనే పుస్తకం లో, నీవు రాసినా అపురూపమైన
కవిత్వం ......మన స్నేహం ....
------------------------------
బ్రహ్మ, బ్రహ్మదేవుడు నీ జీవితంలో ఒక అనుభూతి కలిగే రోజుని రాశాడు
ఆనందాలు, విజయాలు అందించిన క్షణాలని జ్ఞాపకం చేసుకునే రోజు
అపార్ధాలు, అసూయలు దాటిన క్షణాలను గుర్తుచేసుకునే రోజు
ఇక్కడ మాతో గడిపిన తియ్యటి జ్ఞాపకాలు నెమరువేసుకునే రోజు
కొత్త ఆశలు ఆశయాలతో ముందుకు అడుగువేస్తున్న రోజు
ఆ రోజు రానే వచ్చింది నేస్తమా, అదే ఈ రోజు... వీడ్కోలు పలకాల్సిన రోజు
------------------------------ ------------------------------ ------------------------------ -----------------
అందమైన క్షణాలు తో నిడిన రోజులు అవి
తియ్యని జ్ఞాపకాలతో గడిచిన రోజులు అవి
స్నేహం లోనీ మదుర్యాన్ని చూపిన రోజులు అవి
మనస్సు గొప్పతనం గురించి తెలిసిన రోజులు అవి
ఓ మిత్రమా నీవు నాతో ఉన్న రోజులు అవి ........మళ్ళి ఆ రోజులకోసం ఎదురుచూస్తూ....
అపార్ధాలు, అసూయలు దాటిన క్షణాలను గుర్తుచేసుకునే రోజు
ఇక్కడ మాతో గడిపిన తియ్యటి జ్ఞాపకాలు నెమరువేసుకునే రోజు
కొత్త ఆశలు ఆశయాలతో ముందుకు అడుగువేస్తున్న రోజు
ఆ రోజు రానే వచ్చింది నేస్తమా, అదే ఈ రోజు... వీడ్కోలు పలకాల్సిన రోజు
------------------------------
అందమైన క్షణాలు తో నిడిన రోజులు అవి
తియ్యని జ్ఞాపకాలతో గడిచిన రోజులు అవి
స్నేహం లోనీ మదుర్యాన్ని చూపిన రోజులు అవి
మనస్సు గొప్పతనం గురించి తెలిసిన రోజులు అవి
ఓ మిత్రమా నీవు నాతో ఉన్న రోజులు అవి ........మళ్ళి ఆ రోజులకోసం ఎదురుచూస్తూ....
No comments:
Post a Comment