Sunday, June 2, 2013

నేను (NENU) Chapter 5 : మా క్రిష్ణా సర్

నేను : మా క్రిష్ణా సర్

నాకు తెలిసి నేనంటే అంత ఇష్టం ఉన్న వాళ్ళు సర్ తప్పితే ఇంక ఎవరు లేరని చెప్తాను , అంత ఇష్టం ఉన్న సర్ ని నేను కోల్పోయాను .మా సర్ 2012 లో స్వర్గస్తులయ్యారు. అలా నన్ను అత్యంత ప్రభావితం చేసిన మా సర్ ని ఎప్పుడూ తలుచుకుంటూ  ఉంటాను. నేను 5th  క్లాసు లో ఉండగా మా క్లాసు లో ఎప్పుడూ ఫస్ట్
వచ్చే శ్రీకాంత్ ఒక సర్ దగ్గరకి ట్యూషన్ కి వెళ్ళేవాడు.నేనేమో మా క్లాసు లో లాస్ట్. ఒకరోజు శ్రీకాంత్ ని అడిగాను , నేను మీ ట్యూషన్ కి వస్తాను అని. సర్ నాకే చెప్తాడు అని అన్నాడు.

ఎలాగో వాడిని బ్రతిమిలాడి సర్ ని కలిశాను. అదే నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. అప్పుడు నా వయసు పది.
అప్పటినుండి నేను దాదాపు నా MCA దాక ప్రతి exam కి ముందు సర్ దగ్గర ALL THE BEST చెప్పించుకున్న తర్వాతే రాశాను.అదొక సెంటిమెంట్. నాకు ఆయన ఇచ్చిన support నా లైఫ్ లో మర్చిపోలేను.



సర్ కి లివర్ problem వచ్చింది. అయన ఎక్కువరోజులు బ్రతకరు అని నాకు తెలిసిన ఆ క్షణం నాకు ఎప్పటికి మర్చిపోలేను. చాలా బాధపడ్డాను సర్ ని హాస్పిటల్ బెడ్ మీద చూసి ఏడ్చేసాను.అప్పుడు కూడా నాకు ALL THE BEST చెప్పారు. అలాంటి సర్ ఇప్పుడు నాతోలేరు. సర్ వాళ్ళ నా జీవితం మారి పోయింది..

చివరి సారి సర్ ని చూడలేకపోయాను.ఆ లోటు నన్ను చాలా కలిచివేస్తూ ఉంటుంది.

సర్ మీవల్ల నేను మంచి job లో సెటిల్ అయ్యాను.నా లైఫ్ అంత మారి  పోయింది . ఇంకో జన్మ ఉంటె మళ్లీ మీ దగ్గర స్టూడెంట్ అవ్వాలని ఉంది. I MISS YOU SIR .

No comments:

Post a Comment